నిఖిల్ సరసన పెళ్ళిచూపులు భామ!

నిఖిల్ సరసన పెళ్ళిచూపులు భామ!
అప్పటివరకు షార్ట్ ఫిల్మ్స్ లో నటించి, ఆ తరువాత చిన్న చిన్న రోల్స్ లో వెండి తెరపై నటించి ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో హీరోయిన్ గా మారింది రీతూ వర్మ. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో రీతూ అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. వచ్చిన అవకాశాలన్నింటినీ అంగీకరించకుండా సెలెక్టెడ్ గా ఎన్నుకుంటోంది. అందులో భాగంగా తాజాగా ఓ సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది. గతంలో సుధీర్ వర్మ, నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన ‘స్వామిరారా’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి సినిమా చేయడానికి వీరిద్దరు సిద్ధ పడ్డారు. అందులో హీరోయిన్ గా రీతూను సంప్రదించగా కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమా కూడా హిట్ అయితే రీతూకి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. 
CLICK HERE!! For the aha Latest Updates