హాస్పిటల్‌లో స్నేహా ఉల్లాల్ .. వింత వ్యాధితో బాలయ్య హీరోయిన్‌

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ స్నేహా ఉల్లాల్ .. అప్పట్లో జూనియర్ ఐశ్వర్యరాయ్ అంటూ ఆమెను తెగ మోసేశారు. ఈ ముంబై భామ తెలుగులో వరసపెట్టి సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే, ‘సింహా’ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన నటించడంతో స్నేహా ఉల్లాల్ మళ్లీ ఫాంలోకి వస్తుందేమో అనుకున్నారు. కానీ, అదీ జరగలేదు. ప్రస్తుతం స్నేహాకు సినిమా అవకాశాలు లేవు. తెలుగులో చివ‌ర‌గా 2014లో వచ్చిన ‘అంతా నీ మాయ‌లోనే’ సినిమాలో స్నేహా క‌నిపించింది.

త‌న‌కి ‘ఆటో ఇమ్యూన్ డిసార్డర్’ అనే వ్యాధి సోకింద‌ని, దాని వ‌ల‌న క‌నీసం 30 నిమిషాలు కూడా నిల‌బ‌డ‌లేక‌పోతున్నాన‌ని ఆ మధ్య స్నేహా ఉల్లాల్ తెలిపింది. ఆ వ్యాధి రక్తానికి సంబంధించిన‌దని కూడా పేర్కొంది. ఇదిలా ఉంటే, స్నేహా ప్రస్తుతం ఆస్పత్రిలో ఉంది. ఆస్పత్రిలో బెడ్‌పై పేషెంట్‌లా పడుకొని ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహా పోస్ట్ చేసింది స్నేహా ఉల్లాల్.

‘నా జీవితంలో తొలిసారి నేను ఆస్పత్రిలో చేరాను. నాకు విపరీతంగా జ్వరం వచ్చింది. ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా నయం కాలేదు. చాలా భయపెట్టింది. కానీ, ప్రస్తుతం నా ఆరోగ్యం కాస్త బాగానే ఉంది. వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. అలా చేయడం చాలా బోరింగ్‌గా అనిపిస్తోంది. కానీ, నా దగ్గర నెట్‌ఫ్లిక్స్, నన్ను జాగ్రత్తగా చూసుకునే మనుషులు ఉండటంతో బోరింగ్‌గా అనిపించడంలేదు. ఎంత త్వరగా మళ్లీ నా పనిలో నిమగ్నమవుతానా అని వేచి చూస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో స్నేహా ఉల్లాల్ పేర్కొంది.