నిఖిల్ ‘అర్జున్‌ సురవరం’ వాయిదా తప్పడం లేదుగా!

యంగ్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అర్జున్‌ సురవరం’. కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముందగా ‘ముద్ర’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కానీ శ్రీకాంత్ హీరోగా అదే పేరుతో ఓ సినిమా ఇటీవల విడుదల కావటంతో నిఖిల్ సినిమాకు టైటిల్‌కు మార్చక తప్పలేదు.

రిలీజ్‌ విషయంలోనూ అర్జుణ్ సురవరంకు ఇబ్బందులు తప్పటం లేదు. ఈ సినిమాను గత ఏడాది నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మార్చి 29న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ టైంలో రిలీజ్ చేస్తే వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట.

ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే ఏప్రిల్‌లో రిలీజ్ చేయటం కూడా కష్టమే. ఇప్పటికే ఏప్రిల్ డైరీ ఫుల్ అయి పోయింది. దీంతో మే 1న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట అర్జున్‌ సురవరం టీం. టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు.