పొలిటికల్ లీడర్ కు మంచు విష్ణు కౌంటర్!

బీజేపీ నేత జివిఎల్ నరసింహారావ్ ఒక కార్యక్రమంలో సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతూ వారికి జెనరల్ నాలెడ్జ్, ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయని కామెంట్ చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆయన తీరుని తప్పుబడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పుడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా సదరు రాజకీయనాయకుడికి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చాడు.

‘సినీ తారలకు ఐక్యూ, జెనరల్ నాలెడ్జ్ తక్కువ ఉన్నట్లయితే రాజకీయ నాయకులందరూ కూడా అవినీతిపరులే. గొప్ప గొప్ప రాజకీయాల్లో చాలా మంది సినీతారలు ఉన్నారు. ఉదాహరణకి ఎన్.టి.రామారావు గారు, కుమార్ జయలలిత గారు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఎక్కువ ఐక్యూ, జిక్యూ అవసరం లేదు. నేను హిందువుని కానీ క్రిస్టియన్ ను పెళ్లి చేసుకున్నాను. నాకు హిందూత్వం మీద చాలా నమ్మకం ఉంది. ఇదంతా కూడా రాజకీయపరమైనది కాదు కాబట్టి చెబుతున్నాను. నాకు బిజెపీ పార్టీ మీద చాలా గౌరవం ఉంది. మోడీ గారికి నేను పెద్ద అభిమానిని’ అని స్పష్టం చేశారు.