HomeTelugu Trendingఅక్టోబర్‌2న అనుష్క నిశ్శబ్దం..

అక్టోబర్‌2న అనుష్క నిశ్శబ్దం..

Nishabdam movie releasing a
హీరోయిన్‌ అనుష్క శెట్టి, మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’ థియేటర్స్‌లో సంద‌డిచేసేది. కానీ లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింది. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అయ్యేపనికాదన్న విషయం తేలిపోవడంతో నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. అక్టోబ‌ర్‌2న ‘నిశ్శబ్దం’ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేయ‌నున్న‌ట్లు నిర్మాత కోన వెంక‌ట్ ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే ఆ సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ కొనుగోలు చేసింది. దీంతో ఓటీటీ వేదిక‌గా రిలీజ్‌ అవుతున్నతెలుగు సినిమాల్లో రెండో పెద్ద సినిమాగా నిశ్శబ్దం నిల‌వ‌నుంది. థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్‌ పాత్రలో నటించింది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu