HomeTelugu Trending'సర్కారు వారి పాట' అపేడేట్‌ ఇచ్చిన తమన్‌

‘సర్కారు వారి పాట’ అపేడేట్‌ ఇచ్చిన తమన్‌

Thaman shares update sarkar

సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు హీరోగా.. పరశురాం డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ స్పెయిన్‌లో జరుగుతుంది.

ఆ సినిమాకు సంబంధించి ఎస్‌.ఎస్‌ తమన్‌ అభిమానులకు క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తి అయినట్లు తమన్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు మహేశ్‌తో తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇందులో సూపర్‌ స్టైలిష్‌గా మహేష్‌ ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ఈ సినిమా ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu