నితిన్ సినిమా ఎనభై శాతం అక్కడే!

నితిన్, హను రాఘవపూడి ల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే
ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. నవంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్
మొదలుకానుంది. అయితే కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఎనభై శాతం అమెరికా, యూరప్
దేశాలలో జరగాల్సివుంది. దీనికోసం లొకేషన్స్ వేటలో పడ్డారు చిత్రబృందం. ఒక్కసారి
లొకేషన్స్ ఫైనల్ అయిన వెంటనే సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. భారీ
బడ్జెట్ తో రూపొందుస్తోన్న ఈ చిత్రాన్ని 14రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘అ ఆ’ సినిమా హిట్ తో
నితిన్, కృష్ణగాడి వీరప్రేమ గాధ హిట్ తో ఉన్న హను రాఘవపూడి కలిసి చేస్తోన్న సినిమా
కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates