HomeTelugu Trendingఆకట్టుకుంటున్న నిత్య మీనన్‌ ఫస్ట్‌లుక్‌

ఆకట్టుకుంటున్న నిత్య మీనన్‌ ఫస్ట్‌లుక్‌

Nithya Menon first look In

హీరోయిన్‌ శ్రియా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ”గమనం”. సుజనా రావు దర్శకత్వం వహిస్తున్న ఈ రియల్ లైఫ్ డ్రామాలో నిత్యా మీనన్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనుంది. ఈ సినిమాలో శాస్త్రీయ సంగీత గాయని శైలాపుత్రి దేవిగా నిత్య కనిపించనుంది. తాజాగా నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని యంగ్‌ హీరో శర్వానంద్ రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్ లో నిత్య మీనన్‌ సాంప్రదాయమైన వస్త్రధారణలో సంగీత కచేరి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన శ్రీయా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. డీ గ్లామరస్ రోల్ లో శ్రియా ని చూసినప్పటి నుంచి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగియింది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu