HomeTelugu Trending'గమనం' ట్రైలర్‌ను విడుదల చేసిన పవన్‌ కల్యాణ్‌

‘గమనం’ ట్రైలర్‌ను విడుదల చేసిన పవన్‌ కల్యాణ్‌

Gamanam movie trailer

శ్రియ శరణ్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘గమనం’. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా డైరెక్టర్‌ సుజనారావు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టుర్లు గమనంపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా ఈసినిమా తెలుగు ట్రైలర్‌ను ఈ రోజు(బుధవారం) ఉదయం 09.09 గంటలకు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌తో కలిసి ట్రైలర్‌ను వీక్షించారు. ఇక మూడు విభిన్న కథలతో తెరకెక్కిన ‘గమనం’ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. చెవిటి యువతిగా చంటిబిడ్డతో శ్రియ పడే కష్టాలు, క్రికెటర్‌ కావాలనుకునే ఓయువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముస్లిం యువతి, రోడ్డుపై చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు అనాథ పిల్లల జీవితం.. ఇలా మూడు కథలతో గమనం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. అయిదుభాషల్లో ఈ సినిమా రూపొందుతుండటంతో ట్రైలర్‌ను కూడా అయిదు భాషల్లో విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu