HomeTelugu Trending'మను చరిత్ర' ఫస్ట్‌లుక్‌

‘మను చరిత్ర’ ఫస్ట్‌లుక్‌

Manu charitra first lookపెళ్ళి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మ‌ను చరిత్ర‌’. ఈ రోజు శివ బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ సినిమా నుండి ఆయ‌న లుక్ ఒక‌టి విడుద‌లైంది. ఇందులో శివ కందుకూరి గుబురు గ‌డ్డంతో నోట్లో సిగ‌రెట్‌, చేతిలో పువ్వు ప‌ట్టుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. పోస్ట‌ర్‌లో శివ‌ను చూస్తుంటే అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకు వస్తుంది.

మ‌ను చరిత్ర చిత్రాన్ని యాపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుండ‌గా, ఈ చిత్రానికి కాజ‌ల్ స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఈ సినిమా త‌ర్వాత కాజ‌ల్ నిర్మాత‌గాను రాణించ‌నుంద‌నే టాక్ వినిపిస్తుంది. మ‌ను చిరిత్ర చిత్రంలో మేఘా ఆకాశ్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu