HomeTelugu Newsపెళ్లికి కేసీఆర్‌ను ఆహ్వానించిన నితిన్‌

పెళ్లికి కేసీఆర్‌ను ఆహ్వానించిన నితిన్‌

Nitin invites CM KCR for h

భీష్మ సినిమాతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు హీరో నితిన్. త్వరలో పెండ్లికి ఆయన షాలిని అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు. కాగా ఇప్పటికే ‘ ఏప్రిల్ 16న’ వీరి వివాహం జ‌ర‌గాల్సింది. కానీ క‌రోనా వైర‌స్ కారణంగా వాయిదా ప‌డింది. ఈ వైర‌స్ కాస్త స‌ర్దుమ‌నిగిన త‌ర్వాత చేసుకుందాం అని ఇన్నిరోజులు ఎదురు చూసింది ఈ జంట‌. క‌రోనా వ‌చ్చి నాలుగు నెల‌లు అవుతున్న‌ప్ప‌టికీ ఎలాంటి మార్పు రాక‌పోవ‌డంతో ఈ నెల జులై 26న రాత్రి 8.30 నిమిషాల‌కు ముహుర్తం ఖ‌రారు చేసుకున్న‌ట్లు తెలిపారు. వివాహ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావుని క‌లిసి వివాహ ప‌త్రికతో స్వ‌యంగా పెళ్లికి ఆహ్వానించారు నితిన్‌. ఇదివ‌ర‌కే కరోనా వైర‌స్‌తో పోరాడేందుకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 10 లక్షల చెక్‌ని నితిన్ నేరుగా కేసీఆర్‌కు అందజేశారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15న హైద‌రాబాద్‌లో నితిన్‌, షాలిని ఎంగేజ్‌మెంట్ కొంత‌మంది స‌న్నిహితుల మ‌ధ్య జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అన్నీ బాగుంటే.. ఏప్రిల్ 16న దుబాయ్ వేదిక‌గా అంగ‌రంగ వైభ‌వంగా నితిన్‌, షాలినిల పెళ్లి జ‌రిగేది. ఇప్పుడు హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నుమా ప్యాల‌స్‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!