చరణ్ తో ఛాన్స్ కష్టమేమో!

కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా సంపత్ నందికి మంచి పేరు ఉంది. రామ్ చరణ్ తో చేసిన ‘రచ్చ’ సినిమా సంపత్ నందికి దర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమాలు చేసే అవకాశాన్ని తెప్పించింది. అప్పటినుండి కూడా రామ్ చరణ్ తో మరో సినిమా చేయాలని సంపత్ నంది ఎదురు చూస్తున్నాడు. కానీ చరణ్ నుండి మాత్రం పిలుపు రాలేదు. తాజాగా సంపత్ నంది.. ‘గౌతమ్ నంద’ ట్రైలర్ తో అందరికీ షాక్ ఇచ్చాడు. గోపిచంద్ తో ఇంత కాస్ట్లీగా మరే దర్శకుడు తీసి ఉండడేమో.. అంత రిచ్ గా ఉంది ప్రతి ఫ్రేమ్. 
ట్రైలర్ ను బట్టి మరో పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తోంది. ఈ ట్రైలర్ తో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు సంపత్ నంది. ఈ సినిమాకు హిట్ టాక్ గనుక వస్తే రామ్ చరణ్ నుండి తనకు పిలుపు వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు సంపత్. ఇప్పటికే చరణ్ కోసం ‘ఛోటామేస్త్రి’ అనే లైన్ ను కూడా రాశి పెట్టుకున్నాడు. చరణ్ గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కథను డెవలప్ చేసి సినిమా చేయాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడిప్పుడే చరణ్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ.. వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటున్నాడు. ఈ క్రమంలో సంపత్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో.. లేదో.. చూడాలి!