ఘనంగా సౌందర్య రజనీకాంత్‌ వివాహం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ వివాహం నేడు ఘనంగా జరిగింది. చెన్నైలోని ఎంఆర్సీ నగర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ హోటల్‌లో సౌందర్య.. తమిళ నటుడు విశాకన్‌ వనగమూడిని వివాహమాడారు. వేడుకకు సౌందర్య ప్రముఖ డిజైనర్‌ అబుజాని సందీప్‌ ఖోస్లా డిజైన్‌ చేసిన చీరను ధరించారు. మండపానికి సినీ ప్రముఖులు మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న, కమల్‌ హాసన్, సుబ్బరామి రెడ్డి, అనిరుధ్‌ రవిచందర్, ధనుష్‌, ప్రభు, రాఘవ లారెన్స్‌, మంజిమ మోహన్, ఆండ్రియా, మణిరత్నం, సుహాసిని, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈరోజు సాయంత్రం వివాహ విందును ఏర్పాటుచేయనున్నారు.