కేటీఆర్‌ని కలిసిన ఎన్టీఆర్‌ ఫొటో వైరల్‌..

తాజాగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ విజయాన్నిసొంతం చేసుకుంది. సినిమా భాషలో చెప్పాలంటే.. బొమ్మ సూపర్ డూపర్ హిట్టైంది. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం విశేషం. విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ కూడా టీఆర్‌ఎస్‌ పార్టీకి శుభాకాంక్షలు తెలిపాడు. శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా.. కేటీఆర్ ను స్వయంగా కలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఈ ఫోటో ఇటీవలే దిగిందా లేదంటే.. పాత ఫోటోనా అన్నది తెలియాలి. ఏదైతేనేం ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.