HomeTelugu Big Storiesయంగ్ టైగర్ 'బిగ్ బాస్' షో!

యంగ్ టైగర్ ‘బిగ్ బాస్’ షో!

“సరికొత్త ఉత్తేజం” అనే నినాదం తో తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని అందించాలని భావించే ఛానల్ స్టార్ మా. ఈ సంకల్పం తో నే తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో, “బిగ్ బాస్”, ను ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తోంది స్టార్ మా. నటన కి స్టార్ ఇమేజ్ మారు పేరు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మొట్ట మొదటి సారిగా బుల్లి తెర మీదకి తీసుకువస్తోంది “బిగ్ బిన్” షో.
ఒక యువ తరం అగ్ర కథానాయకుడు బుల్లి తెర పై ఇంత పెద్ద షో ను హోస్ట్ చేయటం బహుశా దక్షిణ భారతం ఈ మధ్య కాలం లో ఇదే ప్రధమం. ప్రపంచవ్యాప్తం గా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ బిగ్ బాస్ షో ఎండెమోల్ సంస్థ కు చెందిన ది. హిందీ లో సల్మాన్ ఖాన్ తో ఇప్పటికే పది సీజన్ లు విజయవంతం గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందు కు ఈ షో ను ఎన్టీఆర్ తీసుకువస్తారు.
ప్రత్యేకం గా నిర్మించిన ఒక ఇంట్లో, సుమారు డజను మంది సెలబ్రిటీ లను పెట్టి తాళం వేస్తారు. వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తారు. కానీ బయట ప్రపంచం తో కానీ, సెల్ ఫోన్ లు టీవీ లు, పేపర్ లు వంటి మాధ్యమాల తో కానీ వారికి సంబంధం ఉండదు. ఆ ఇల్లే వారి ప్రపంచం. వారి ప్రతి కదలికను కెమెరా లు రికార్డు చేస్తూనే ఉంటాయి. వీరి జీవన శైలి ని ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు. ఒకరి తో ఒకరికి సంబంధం లేని వాళ్ళు బయట ప్రపంచం తో సంబంధం లేని ఒక ఇంట్లో ఎలా ఉండగలుగుతారు అనేది ఆశక్తికరమైన అంశం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “టీవీ అనేది ఏంతో ప్రాముఖ్యత కలిగిన ఎంటర్టైన్మెంట్ మాధ్యమం. తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో గా రూపొందుతోన్న “బిగ్ బాస్” ను హోస్ట్ చేయమని స్టార్ మా వారు నన్ను సంప్రదించినప్పుడు, చాలా ఆశక్తి కరం గా అనిపించింది. ఈ షో తప్పకుండా ఒక గేమ్ చేంజర్ అవుతుంది” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!