యన్‌.టి.ఆర్‌ బయోపిక్‌ నుంచి మరోపాట

ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా యన్‌.టి.ఆర్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతిష్టాత్మక తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్‌ దర్శకుడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈమూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికి సంబంధించిన పాటను రిలీజ్ చేయగా తాజాగా ఎన్టీఆర్‌ రాజకీయా జీవితానికి సంబంధించిన మరో పాటను విడుదల చేశారు.

ఎక్కువగా సంస్కృత పదాలతో గంభీరంగా ఉన్న ఈ పాటకు శివ దత్త, రామకృష్ణ, కీరవాణిలు సాహిత్యంమందించగా శరత్‌ సంతోష్‌, మోహన భోగరాజు, కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమలలు ఆలపించారు.కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో పాటు ఎంతో మంది టాలీవుడ్ నటీమణులు సందడి చేయనున్నారు. బాలకృష్ణ వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా బ్యానర్లతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates