విడుదల సన్నాహాల్లో ఎరోటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ ‘రెడ్’

విడుదల సన్నాహాల్లో ఎరోటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్  ‘రెడ్’
కన్నడలో ఘన విజయం సాధించిన ‘రెడ్‌’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆలుమగల మధ్య ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల.. వారి జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించింది.
నిర్మాత భరత్‌ మాట్లాడుతూ…  ‘ఈ చిత్రానికి కన్నడలో దర్వకత్వం వహించిన  రాజేష్‌మూర్తి..  ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించడంతోపాటు సంగీతం కూడా సమకూర్చడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ..   ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్‌ మర్డర్‌ మిస్టరీ ‘రెడ్’. కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం”‘ అన్నారు. 
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అంజన్‌, పబ్లసిటీ డిజైనర్: వెంకట్.ఎం, నిర్మాత: భరత్‌, సంగీతం-దర్శకత్వం: రాజేష్‌మూర్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here