HomeTelugu Trendingకరోనాపై పోరుకు నిధి అగర్వాల్ సాయం

కరోనాపై పోరుకు నిధి అగర్వాల్ సాయం

Nighi Agarwal help
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. తమిళనాడులో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ ఆపత్కాలంలో ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమవంతు సహాయం అందించేందుకు పలువురు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. సినీ తారలు తమవంతుగా సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. తాజాగా హీరోయన్ నిధి అగర్వాల్ తనవంతుగా తమిళనాడు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. నిధి అగర్వాల్ తనవంతుగా సోషల్ మీడియాలో కోవిడ్‌పై అవగాహన కల్పిస్తోంది. దేశంలో ఖాళీగా ఉన్న కోవిడ్ బెడ్‌ల సమాచారాన్ని `ఫైండ్ ఏ బెడ్` పేరుతో తెలుసుకునేందుకు కాజ్ అంబాసిడర్ నిధి ప్రచార సాయం చేస్తోంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu