HomeTelugu Big StoriesRRR: పవర్‌ఫుల్‌ లుక్‌తో కొమురం భీమ్‌

RRR: పవర్‌ఫుల్‌ లుక్‌తో కొమురం భీమ్‌

NTR New Poster From RRR
నేడు (గురువారం) యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌తో యంగ్‌ టైగర్‌ అభిమానుల్ని మరోసారి ఫిదా చేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఓ సరికొత్త లుక్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌, రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ భామ ఆలియాభట్‌ సందడి చేయనున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వీడియోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu