త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందా..?

‘హరికా అండ్ హసినీ క్రియేషన్స్’ నుండి వచ్చే తాజా చిత్రం వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వుండబోతుంది అని ఆ సంస్థ వారు ప్రకటించారు. త్రివిక్రమ్ యొక్క తదుపరి ప్రాజెక్ట్ మరియు ఈ బ్యానర్ యొక్క ఆరో సినిమా గా వస్తుంది, ఇందులో వెంకటేష్ హీరోగా నటించబోతున్నారు. ఈ వార్తను అకస్మాత్తుగా ప్రకటించడంతో ఇప్పుడు ఇది కొన్ని చర్చలకు దారితీసింది. ‘హరికా అండ్ హసినీ క్రియేషన్స్’ బ్యానర్ పై నాలుగో సినిమా గా ‘అజ్ఞాతవాసి’ వస్తుంది.

ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే నెల 10 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది అయితే ఎన్టీఆర్ ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి సినిమాలో చేయడానికి సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా మొత్తానికి ఆగిపోయిందో లేక మరలా తిరిగి షూటింగ్ మొదలు అవుతుందా అనేది తెలియాల్సివుంది!