HomeTelugu Trending'కళ్యాణం కమనీయం' లిరికల్‌ సాంగ్‌ విడుదల

‘కళ్యాణం కమనీయం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

Oh Manasa Lyrical from Kaly

టాలీవుడ్‌ యువ నటుడు సంతోష్‌ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కళ్యాణం కమనీయం’. ప్రియా భవానీ శంకర్‌ ఈ సినిమాలోహీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓ మనసా’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. హీరోహీరోయిన్ల పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాట మ్యూజిక్‌ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను శ్రావణ్ భరద్వాజ్‌ కంపోజ్ చేస్తూ.. లలిత కావ్యతో కలిసి పాడాడు. అనిల్‌ కుమార్‌ అల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కొత్త ప్రయాణం మొదలు.. అందమైన వెడ్డింగ్ మెలోడీ సాంగ్ ఓ మనసా మీ ముందుకు.. అంటూ మేకర్స్ సాంగ్‌ను షేర్ చేశారు.

సంతోష్ శోభన్ ప్రస్తుతం.. ప్రేమ్‌ కుమార్‌, అన్ని మంచి శకునములే సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘లైక్‌ షేర్‌ అండ్ సబ్‌స్క్రైబ్‌’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమాపై హోప్స్‌ పెట్టుకున్నాడు సంతోష్‌ శోభన్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu