HomeTelugu Trendingమనోజ్‌ సినిమాలో హీరోయిన్‌గా ప్రముఖ యాంకర్‌!

మనోజ్‌ సినిమాలో హీరోయిన్‌గా ప్రముఖ యాంకర్‌!

6a 3
మంచు హీరో మనోజ్‌ మూడేళ్ళ విరామం తర్వాత సినిమాల్లోకి వస్తున్నాడు. గతకొంత కాలంగా గ్యాప్ తరువాత మనోజ్ ఒక పవర్ ఫుల్ కథతో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో విడుదల చెయ్యాలని సన్నహాలు చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు ఈ మంచువారబ్బాయి. కాగా ఈ సినిమాకు ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే మనోజ్‌ వెల్లడించాడు.

ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త యంగ్‌ డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో మనోజ్‌కు జంటగా నటించబోయే హీరోయిన్‌ను ఎంపిక చేసారు. ఆమె ఓ టీవీ యాంకరట. పలు తమిళ టెలివిజన్ షో వ్యాఖ్యాతగా వ్యవరించిన ప్రియా భవానీ శంకర్ అనే యాంకర్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. కథ డిమాండ్ మేరకు కొత్త అమ్మాయి అయితేనే బావుంటుందని ఈ భామను తీసుకున్నరట. మరి ఈ సినిమాతో మనోజ్ హిట్ కొడతాడేమో చూడాలి.

6 16

Recent Articles English

Gallery

Recent Articles Telugu