ఒకే సెట్లో మెగాబ్రదర్స్!

చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది.
ఇటీవలే సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ సినిమా
షూటింగ్ మరో రెండు, మూడు రోజులు ఓ సెట్ లో జరుపుకోవాల్సివుంది. దీనికోసం ఇప్పుడు
కొత్తగా సెట్ వేయడంఖర్చుతో కూడుకున్న పని.. అయినప్పటికీ చిత్రబృందం వద్ద అంత
సమయం కూడా లేదట. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని గ్యాప్
తీసుకోకుండా పని చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో సెట్ కోసం ఏం చేయాలా..? అని ఆలోచిస్తున్న
తరుణంలో పవన్ కల్యాణ్ ఆ సన్నివేశాల కోసం ‘కాటమరాయుడు’ సినిమా కోసం వేసిన సెట్
ను వినియోగించుకోమని చెప్పాడట. మరో రెండు రోజుల పాటు షూటింగ్ ఇక్కడే జరగనుంది. సో..
కాటమరాయుడు సినిమా సెట్ ను సంక్రాంతికి చిరంజీవి సినిమాలో చూడొచ్చన్నమాట!

CLICK HERE!! For the aha Latest Updates