నాగ్ సినిమా రిలీజ్ డేట్ చెప్పేశాడు!

అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వెంకటేశ్వరస్వామి భక్తుడు హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ల సినిమాలు నిలవడంతో ఈ పోటీ ఎలా ఉంటుందో అని అభిమానులు అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ పోటీ నుండి నాగ్ తప్పుకున్నట్లు సమాచారం.

సినిమా టాకీ పార్ట్ పూర్తయినప్పటికీ గ్రాఫిక్స్ వర్క్ మొత్తం అలానే ఉండడంతో సంక్రాంతి నాటికి సినిమా రిలీజ్ చేసే అవకాశాలు కనిపించట్లేదు. గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించాలి గనుక ఫిబ్రవరి 10న సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చిత్రబృందం చెబుతోంది. అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్ లు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.