HomeTelugu Newsతెలంగాణలో టిక్కెట్ బుకింగ్ యాప్స్‌కి షాక్

తెలంగాణలో టిక్కెట్ బుకింగ్ యాప్స్‌కి షాక్

8 17
ఆన్‌లైన్ సినిమా టికెట్ బుకింగ్ యాప్స్‌ కి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రకరకాల ట్యాక్స్‌లను టిక్కెట్లపై రుద్దుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న బుక్ మై షో, పేటీఎం, ఈజీ మూవీస్ వంటి సైట్ లకి షాక్ ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. బుక్ మై షో, పేటిఎం,ఈజీ మూవీస్ పేర ఒక యూనియన్ గా మారి రకరకాల ట్యాక్స్‌లను సినిమా టిక్కెట్ల రేట్లకు జోడించి సామాన్యుల జేబుల నుంచి విపరీతంగా దోచేస్తున్నారు.

ఇకపై దీనికి చెక్ పెడుతూ ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ టిక్కెట్ల అమ్మకాల కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం తీసుకురానుంది. ఇప్పటికే ప్రభుత్వం ఒక బుకింగ్ సైట్ ఓపెన్ చేసింది అయినా అందులో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు ఇప్పుడు తాజాగా ఈ వ్యవహరం వెలుగులోకి రావడంతో ఆ సైట్ నే మరింత మెరుగుపరిచే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఆన్‌లైన్‌ సినిమా టికెట్లను ప్రభుత్వం త్వరలో రద్దు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అధికారికంగా టికెట్ల అమ్మకాల కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని 18 నుంచి 20 లైన్స్… 8 నుంచి 10 లైన్స్ సిట్టింగ్ ఏర్పాటు చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం నుంచి టికెట్ల అమ్మకాలు చేపడితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లాభపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu