HomeTelugu TrendingFastest 200M Songs in Youtube: తెలుగు పాటల హవా.. మహేష్ కంటే ముందు సమంత రికార్డ్!

Fastest 200M Songs in Youtube: తెలుగు పాటల హవా.. మహేష్ కంటే ముందు సమంత రికార్డ్!

Fastest 200M Songs in Youtube

Fastest 200M Songs in Youtube: టాలీవుడ్​ స్టార్ హీరో మహేశ్ బాబు- శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ ఏడాది సంక్రాంతి విడుదలైన ఈ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్​లో 200 మిలియన్ వ్యూస్ సాధించి అరుదైన రికార్డు కొట్టింది. ఈ పాట రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్​లో నడించింది.

ఈ మధ్య కాలంలో గ్రాండ్ ఈవెంట్స్​, బర్త్​డే ఫంక్షన్స్ ఇలా ఎక్కడ చూసిన ఈ పాటే ఎక్కువగా వినిపించింది. దీంతో సాంగ్ వచ్చిన 78 రోజుల్లోనే 200+ మిలియన్ క్లబ్​లో చేరింది. అయితే యూట్యూబ్​లో అతి తక్కువ రోజుల్లో ఈ మైల్​స్టోన్ దాటిన సాంగ్ ఏంటో మీకు తెలుసా?

అల్లు అర్జున్ బ్లాక్​బస్టర్ పుష్ప పార్ట్-1 మూవీలోని ‘ఊ అంటావా? ఉఊ అంటావా’ సాంగ్ ఈ లిస్ట్​లో టాప్​లో ఉంది. ఈ పాట రిలీజైన 68 రోజుల్లోనే యూట్యూబ్​లో 200+ మిలియన్ వ్యూస్ అందుకుంది. ఈ క్రమంలో యూట్యూబ్​లో అతి తక్కువ రోజుల్లో ఈ ఘనత సాధించిన తెలుగు పాటగా రికార్డు కొట్టింది. ఇప్పటి దాకా ఈ సాంగ్​కు 414 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

దేవీ శ్రీ కంపోజ్ చేసిన ఈ పాట​ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్​లో ఉంటుంది. ఇక ఈ సాంగ్​లో స్టార్ హీరోయిన్‌ సమంత స్పెషల్ అప్పియరెన్స్​ ఇచ్చింది. బన్నీతో పోటీపడి మరీ ఈ సాంగ్‌లో సమంత స్పెప్పులు వేసి ఆడియెన్స్​ను ఆకట్టుకుంది.

ఇక ఈ లిస్ట్​లో మూడో స్థానంలోనూ అల్లు అర్జున్ పాటే ఉండడం విశేషం. బన్నీ- పూజా హెగ్డే ‘బుట్టబొమ్మ బుట్టబొమ్మ’ పాట 95 రోజుల్లో ఈ ఫీట్ సాధించింది. ఈ పాట కూడా అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్​కు సోషల్ మీడియాలో రీల్స్ సైతం అదిరిపోయాయి. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం తన చిన్నారులతో ఈ పాటకు రీల్స్ చేశాడు. ఈ సాంగ్ 873 మిలియన్ వ్యూస్​తో ఇప్పటికీ యూట్యూబ్​లో ప్లే అవుతోంది.

ఇలా ఫాస్ట్ గా 200 మిలియన్స్ వ్యూస్ సాధించిన సాంగ్స్ లో సమంత ఊ అంటావా ఊ ఊ అంటావా మొదటి ప్లేస్ లో ఉంటే, మహేష్ కుర్చీ మడతబెట్టి సాంగ్ రెండో ప్లేస్ లో ఉంది. అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ మూడో ప్లేస్ లో ఉంది. ఈ రికార్డ్ లో మాత్రం మహేష్, బన్నీని దాటించి మరీ సమంత టాప్ లో నిలిచింది అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఆ సాంగ్ లో అల్లు అర్జున్ కూడా ఉండటం గమనార్హం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu