
Mahesh Babu fans in Hyderabad Metro:
సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు కొత్త సంవత్సరానికి విశేషంగా స్వాగతం పలికారు. వారి అభిమాన నటుడు మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాను పెద్ద స్క్రీన్‌పై చూసేందుకు RTC క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ వద్ద ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో నిర్వహించిన ఈ షోలతో అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది.
అభిమానుల ఆనందం ఇక్కడితో ఆగలేదు. కొందరు అభిమానులు ఈ ఉత్సవాన్ని హైదరాబాద్ మెట్రోలోకి తీసుకెళ్లి “జై బాబు జై జై బాబు,” “జై మహేశ్ బాబు,” “బాబులాకే బాబు మహేశ్ బాబు” వంటి నినాదాలతో హడావుడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Happening now on the MGBS metro. The men have just watched Mahesh Babu’s Guntur Karam which was released again. pic.twitter.com/EHSJhYcqrj
— serish (@serish) December 31, 2024
అయితే, ఈ మెట్రో ఉత్సవంపై నెటిజన్లలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఇది సృజనాత్మకంగా ఉన్నట్లు ప్రశంసించగా, మరికొందరు ప్రజా ప్రదేశంలో ఇలాంటి వేడుకలు అనవసరం అని అభిప్రాయపడ్డారు.
‘గుంటూరు కారం’ విడుదల సమయంలో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, సినిమాలోని “కుర్చీ మడత పెట్టి” పాట ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ పాటను థియేటర్లలో మళ్లీ చూడడం అభిమానులకు ఎంతో ఆనందం కలిగించింది.
మహేశ్ బాబు ప్రస్తుత ప్రాజెక్ట్ SSMB 29 కోసం డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళితో కలిసి పని చేస్తున్నారు. గ్లోబల్ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఇవాళ అంటే జనవరి 2, 2025న హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో గ్రాండ్ గా ప్రారంభించారు.
ALSO READ: CM Chandrababu చేసిన మొదటి సంతకం… ఎవరికి లాభమో తెలుసా?