HomeTelugu Trendingనారప్ప నుండి 'చలాకీ చిన్నమ్మి' పాట విడుదల

నారప్ప నుండి ‘చలాకీ చిన్నమ్మి’ పాట విడుదల

Ooo Narappa Lyrical Video f
వెంకటేష్ నటించిన చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తుంది. జులై 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా.. తాజాగా ‘చలాకీ చిన్నమ్మి’ పాటల్ని విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో సర్‌ప్రైజ్‌ని అందించింది. ‘ఓ.. నారప్ప’ అంటూ సాగే గీతాన్ని (లిరికల్‌ వీడియో) విడుదల చేసింది. అనంత శ్రీరామ్‌ రచించిన ఈ పాటని ధనుంజయ్‌, వరం ఆలపించారు. మణిశర్మ సంగీతం అందించారు. వెంకటేశ్‌, అమ్ము అభిరామి మధ్య తెరకెక్కించిన గీతమిది. ఈ సినిమాలో వెంకటేశ్‌ రెండు విభిన్న పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. యువకుడి పాత్రకి జోడీగా అభిరామి నటించింది. కార్తీక్‌ రత్నం, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌. థాను సమర్పణలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu