‘శాకుంతలం’ రుషివనంలో సాంగ్‌ విడుదల

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటిస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్‌ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా రెండోవ పాట ‘రుషివనంలోన’ను విడుదల చేశారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వెర్షన్‌ సాంగ్‌ను కూడా విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌ను సిద్ శ్రీరామ్‌, చిన్మయి పాడారు. శ్రీమణి ఈ పాట రాశారు.

శాకుంతలం నుంచి ఇప్పటికే విడుదలైన మల్లిక మల్లిక పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాన్‌ ఇండియా మూవీలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు దిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates