HomeTelugu Trendingఆసక్తికరంగా 'ఊరు పేరు భైరవ కొన' టీజర్‌

ఆసక్తికరంగా ‘ఊరు పేరు భైరవ కొన’ టీజర్‌

Ooru Peru Bhairavakona Teas
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవ కోన’. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ సినిమా మొత్తం గరుడపురాణం చుట్టూ తిరుగుతుందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. ‘శ్రీ కృష్ణ దేవరాయ కాలంలో చెలామణిలో ఉన్న గరుడపురాణానికి, ఇప్పటి గరుడపురాణానికి.. నాలుగు పేజీలు తగ్గాయి..’ అనే డైలాగ్ తో మొదలయ్యే టీజర్.. ‘ఆ నాలుగు పేజీలే భైరవ కోన’ అనే డైలాగ్ తో ముగుస్తుంది. ‘ఈ ఊరిలోకి రావడమే కానీ.. బయటకు పోవడం ఉండదు’ అనే డైలాగ్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఈ టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. శేఖర్‌ చంద్ర బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వేరే లెవల్లో ఉంది. రాజ్‌ తోట సినిమాటోగ్రఫి హైలైట్‌. నైట్‌ షాట్స్ అద్భుతంగా తీశారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ తదితర చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్‌, హాస్య మూవీస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu