గోపిచంద్‌ ‘చాణక్య’ మూవీ టీజర్‌

గోపిచంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చాణక్య’. రా ఏజెంట్‌గా అర్జున్‌ పాత్రలో గోపిచంద్‌ నటించిన ఈ సినిమా టీజర్‌ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌లో ఉన్న యాక్షన్‌ సీన్స్‌ ఈ చిత్రానికి హైలెట్‌గా మారనున్నాయి. ఈ మూవీలో మెహ్రీన్‌, జరీన్‌ ఖాన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించిన ఈ మూవీకి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.