HomeTelugu Newsవిశ్వక్‌ సేన్‌ “ఓరి దేవుడా” మోషన్‌ పోస్టర్‌

విశ్వక్‌ సేన్‌ “ఓరి దేవుడా” మోషన్‌ పోస్టర్‌

Ori Devuda Motion Poster
టాలీవుడ్‌ యంగ్ హీరో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి “ఓరి దేవుడా” అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్‌ చేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన మేకర్స్ ఈరోజు మంగళవారం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు.

ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ”ఓరి దేవుడా” సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవులే’ చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ – రితికా సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అక్కడ ఘన విజయం సాధించింది. మాతృకను డైరెక్ట్ చేసిన అశ్వత్ తెలుగు వెర్షన్ కూ దర్శకత్వం వహిస్తున్నారు. పీవీపీ సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. పెర్ల్ వి పొట్లూరి – పరమ్ వి పొట్లూరి – దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu