నీ ఆలోచన ఇప్పటికే కింది స్థాయిలోనే ఉంది.. నెటిజన్‌కి లావణ్య కౌంటర్‌!

ఈమధ్య సోషల్ మీడియాలో కొందరు సినీ తరాల ఫోటోలు, స్టేట్మెంట్స్ పై అడ్డూ అదుపు లేకుండా కామెంట్స్ చేయడం ఎక్కువైంది. మొదట్లో స్టార్లు కూడ వాటిని ఈజీగానే తీసుకున్నా ఆ తర్వాత తర్వాత స్పందించడం మొదలుపెట్టారు. ఘాటైన సమాధానాలిస్తూ ఆకతాయిల కళ్ళు తెలిరిపిస్తున్నారు. తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఫోటో ఒకదాన్ని ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. దానికి ఒక నెటిజన్ ఫోటో ఇంకొంచెం కింది పెట్టుంటే బాగుండేది కదా అంటూ కామెంట్ పెట్టాడు. దానికి లావణ్య నీ ఆలోచన ఇప్పటికే కింది స్థాయిలో ఉంది. నేను ఫోటో మొత్తం పెట్టినా అది మీ ఆలోచనా విధానం కన్నా పైనే ఉంటుంది అంటూ కౌంటర్ ఇచ్చారు.