HomeTelugu Trendingబ్రహ్మానందం 'పంచతంత్రం' టీజర్‌

బ్రహ్మానందం ‘పంచతంత్రం’ టీజర్‌

Panchatantram movie teaser
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. ఈ సినిమాలో స్వాతి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. హర్ష పులిపాక డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘పంచతంత్రం’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం ఓ చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు. చిరుత పెట్టిన పరుగు కథలు.. ఈగ చెప్పిన బాహుబలి కథలు.. వినటానికి వచ్చిన వాటికి మైక్‌ దగ్గర ఓ ముసలి తాబేలు కలిసింది…’ అంటూ సత్యదేవ్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఆకట్టుకునేలా ఉంది. నిత్యం జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ ఫీల్‌ గుడ్‌ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్రబృందం చెబుతోంది. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్‌, సృజన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu