నాని దెబ్బకు పరుగులు పెడుతున్న బడా నిర్మాతలు

ఇదేంటి జెర్సీ హిట్టైంది కదా… నిర్మాతలు పరుగులు పెట్టడం ఏంటి… అని ఆశ్చర్యపోకండి. ఇందులో చాలా మ్యాటర్ ఉంది. నాని హీరోగా చేసిన జెర్సీ సినిమా గతవారం విడుదలై మంచి విజయాని సొంతం చేసుకుంది. పబ్లిక్ టాక్ కు సూపర్ గా ఉండటంతో… ఈ సినిమాను ఇతర భాషల్లోకి రీమేక్ చేసేందుకు అక్కడి ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారు.

తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో జెర్సీ హక్కులను సొంతం చేసుకోవడానికి బడాబడా నిర్మాతలు ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ, కన్నడలో రాజ్ కుమార్, హిందీ కరణ్ జోహార్ లు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఆయా భాషల హక్కులకు సంబంధించిన సమాచారం అధికారికంగా వెలువడాల్సి ఉంది.