బన్నీని కావాలనే టార్గెట్ చేస్తున్నారు!

గతంలో ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ ఫ్యాన్స్ తో కాంట్రవర్సీకు దిగాడు అల్లు అర్జున్. ఆ తరువాత ఆయన ‘ఒక మనసు’ సినిమా ఆడియో ఫంక్షన్ లో క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ వివాదం ముగిసిపోలేదు సరి కదా.. రోజురోజుకి ముదురుతోంది. ఎంతగా అంటే అల్లు అర్జున్ ను ద్వేషిస్తూ ఓ వర్గం పుట్టుకొచ్చేసింది. నిన్న విడుదలైన దువ్వాడ జగన్నాథం సినిమా టీజర్ పై ఈ వర్గం వారు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఈ టీజర్ ను డిస్ లైక్ చేసే వారి సంఖ్య వేల సంఖ్యలో ఉంది.
ఇప్పుడు టాలీవుడ్ లో అత్యధిక డిస్ లైక్స్ వచ్చిన టీజర్ గా ‘డి.జె’ చోటు సంపాదించుకుంది. అసలు ఇప్పటివరకు డిస్ లైక్స్ ను లిస్ట్ లోకి తీసుకోవడం జరగలేదు కానీ ‘డి.జె’ విషయంలో మాత్రం పరిగణలోకి తీసుకోవడానికి కారణం ఇప్పటివరకు ఈ సినిమాకు 60 వేల డిస్ లైక్స్ రావడమే.. బన్నీ కాంట్రవర్సీ, అల్లు శిరీష్ పవన్ ను ఏకవచనంతో సంబోధించిన ప్రైవేట్ మెసేజ్ లు బయటకు రావడం.. ఇలా ఒకదాని తరువాత ఒక ఇష్యూతో ఫ్యాన్స్ రగిలిపోతున్నారని తెలుస్తోంది.