రోగ్ వ్యవహారాలు ఛార్మి చేతుల్లోకి..?

హీరోయిన్ గా తన క్రేజ్ తగ్గిన తరువాత ఛార్మి, పూరీ జగన్నాథ్ ఆఫీసులో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేది. ఛార్మిని నిలబెట్టడానికి ఆమెతో కలిసి జ్యోతిలక్ష్మి సినిమాను రూపొందించాడు పూరీ. అయితే ఆ తరువాత ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా పూరీ జగన్నాథ్ తన ఆఫీస్ లో పనిచేసే చాలా మంది స్టాఫ్ ను ఉద్యోగాల నుండి తప్పించాడు. అదే సమయంలో ఛార్మిని కూడా దూరం పెట్టేశాడు. అప్పటివరకూ పూరీ ఆఫీసులో తన జెండా ఎగరేసిన ఛార్మి ఒక్కసారిగా ఆ ప్రాంతం నుండి దూరమయ్యింది.
అయితే తాజా సమాచారం ప్రకారం మళ్ళీ ఛార్మీ, పూరీ ఆఫీసులో దర్శనం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూరీజగన్నాథ్రూ పొందించిన ‘రోగ్’ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలన్నీ ఛార్మీ దగ్గరుండి చూసుకోబోతుందట. ఏ చానల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వాలి.. ఎవరికి యాడ్స్ ఇవ్వాలనే విషయంలో ఛార్మినే పూర్తి బాధ్యతలు వ్యవహరించబోతుందని చెబుతున్నారు. ఈ ఒక్క సినిమాతో మాత్రమే కాకుండా పూరీ బ్యానర్ లో వచ్చే మరిన్ని సినిమాలు ఛార్మి ఆధ్వర్యంలోనే తెరకెక్కిస్తారని టాక్. gooమరి ఈసారి అమ్మడు ఎంతకాలం పెత్తనం చెలాయిస్తుందో.. చూడాలి!