HomeTelugu Trendingపవన్ కల్యాణ్ తాజా మూవీ అప్‌డేట్

పవన్ కల్యాణ్ తాజా మూవీ అప్‌డేట్

Pawan Rana latest movie
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించనున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను శుక్రవారం చిత్ర బృందం విడుదలచేసింది. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇందులో హీరోయిన్లుగా సాయి పల్లవి, ఐశ్వర్యరాజేశ్‌ నటిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వకీల్‌సాబ్’ టీజర్‌తో పవన్ అభిమానులను ఖుషీగా ఉన్నారు. పవన్ తర్వాతి సినిమా తాజా అప్‌డేట్‌తో పవన్ ఫ్యాన్స్ మరింత సంబరపడుతున్నారు.

యూట్యూబ్‌లో ట్రెండ్‌ సృష్టిస్తున్న ‘వకీల్‌సాబ్‌’

Recent Articles English

Gallery

Recent Articles Telugu