యూట్యూబ్‌లో ట్రెండ్‌ సృష్టిస్తున్న ‘వకీల్‌సాబ్‌’


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్‌’ మూవీ టీజర్‌ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ సినిమాలో తెరకెక్కుతుంది. పవన్‌కల్యాణ్‌ లాయర్ గా కనిపించనున్న ఈ మూవీ టీజర్‌ సంక్రాంతి కానుకగా విడుదలైంది. నెటిజన్లతోపాటు, సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ కే టీకా వేస్తాడు పవన్ అంటూ సెలెబ్రిటీలు ట్వీట్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్ దీంతో ఈ టీజర్‌ వ్యూస్‌తో, లైక్స్‌తో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ 1గా దూసుకెళ్తోంది. అతి తక్కువ సమయంలోనే వకీల్ సాబ్ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్ లో నిలిచింది. ట్విట్టర్ లోను పవన్ కళ్యాణ్ హంగామా ఏమాత్రం తగ్గలేదు. వకీల్ సాబ్ హ్యాష్ టాగ్స్ లతో ఫ్యాన్స్ ట్విట్టర్ ను షేక్ చేశారు. టీజర్ లో పవన్ చెప్పిన డైలాగులు, పవన్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. ‘కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. శృతిహాసన్ హారోయిన్‌గా నటించింది.

వకీల్‌సాబ్‌ ‘టీజర్‌’

CLICK HERE!! For the aha Latest Updates