HomeTelugu Trendingసితారతో మహేష్ డ్యాన్స్.. వైరల్‌

సితారతో మహేష్ డ్యాన్స్.. వైరల్‌

7సూపర్ స్టార్ మహేష్‌బాబు ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉంటారు. కాస్త ఖాళీ దొరికిందంటే మొత్తం సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తుంటారు. సంవత్సరంలో రెండు మూడు సార్లు భార్య, పిల్లలతో కలిసి హాలీడేస్‌కు కూడా వెళ్తుంటారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి కుటుంబంతో కలిసి మహేష్ దుబాయ్ వెళ్లారు. న్యూ ఇయర్ వేడుకల్లో పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి బాగా ఎంజాయ్ చేశారు. డిసెంబర్ 31 రాత్రి కూతురు సితారతో కలిసి మహేష్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అక్కడ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో డ్యాన్స్ చేస్తున్నారు. మహేష్ కూడా సితార చేతులు పట్టుకుని సరదాగా డ్యాన్స్ చేయించారు. వాస్తవానికి సితారతో సమయం గడపడమంటే మహేష్‌కు చాలా ఇష్టం. ఇదే విషయాన్ని గతంలో నమ్రతా శిరోద్కర్ కూడా చెప్పారు. ‘మా పాప సితారతో డ్యాన్స్ చేయడమంటే మహేష్‌కు చాలా ఇష్టం’ అని ‘భరత్ అనే నేను’ సినిమా సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత చెప్పారు. కాగా, దుబాయ్ వెళ్లిన తరవాత ‘చిల్లింగ్ ఎట్ మిక్స్ విత్ ది బాయ్స్’ అనే ట్యాగ్ లైన్‌తో స్నేహితులతో కలిసి దిగిన ఫొటోని మహేష్ బాబు షేర్ చేశారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu