మరిన్ని పంపండి: రాజమౌళి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’కు టైటిల్ పెట్టే భాద్యత ప్రేక్షకులకే అప్పజెప్పాడు. ప్రేక్షకులు తమకు తోచిన టైటిల్స్ చెబితే వాటిలో ఒకదాన్ని చూజ్ చేసుకుంటామని అన్నారు. అయన మాటలతో చాలామంది తోచిన టైటిల్ సజెస్ట్ చేశారు. వాటిలో కొన్ని బాగున్నాయన్న జక్కన్న ఇంకా టైటిల్స్ పంపాలని, వాటి నుండే ఒకదాన్ని ఎంచుకుంటామని అన్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న చిత్రాన్ని 2020లో విడుదలచేయనున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, బిజినెస్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి