పవన్ కల్యాణ్ కు కొత్త అత్త..?

టైటిల్ చూసి పవన్ కల్యాణ్ మరొక పెళ్ళెమైనా చేసుకుంటున్నాడా..? అనుకోకండి. నిజంగానే
ఆయనకు ఓ కొత్త అత్త వస్తోంది. అయితే రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో… జల్సా, అత్తారింటికి
దారేది వంటి చిత్రాలతో తమది హిట్ కాంబినేషన్ అని నిరూపించుకున్న పవన్, త్రివిక్రమ్ లు
మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమని సమాచారం.
కథ పరంగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కు ఓ అత్త క్యారెక్టర్ ఉంది. దీనికోసం చాలా పేర్లు
వినిపించినప్పటికీ ఫైనల్ గా సీనియర్ నటి ఖుష్బూను తీసుకున్నారని సమాచారం. మొదట
ఈ పాత్ర కోసం నదియాను తీసుకోవాలనే అనుకున్నారు. అయితే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో
ఆల్రెడీ చూసి ఉండడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఖుష్బూను
సంప్రదించారు చిత్రబృందం. ఆమె చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న సినిమా
కావడంతో కాస్త అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates