త్రివిక్రమ్ సినిమాలో పవన్ రోల్!

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. దానికి కారణం గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమా బ్లాక్ బాస్టర్స్ కావడమే. అయితే ఈసారి త్రివిక్రమ్, పవన్ ను ఎలా చూపించబోతున్నాడా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో పవన్ ఓ సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో పని చేసే వ్యక్తిగా కనిపించబోతున్నాడట.
దీనికోసమే త్రివిక్రమ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపనీ సెట్ వేయించినట్లుగా తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమా రిలీస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా పట్టలెక్కిస్తాడు.