వకీల్‌ సాబ్‌ బెనిఫిట్‌ షో.. టికెట్‌ ధరెంతో తెలుసా!

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ మూవీ ట్రైలర్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న ఈ మూవీకి అమెరికాతో మొదలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా బెనిఫిట్ షోస్ ను ప్లాన్ చేస్తున్నారు. అమెరికా సహా అన్ని చోట్ల బెనిఫిట్ షోలను చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా బెనిఫిట్ షో టికెట్ ధరను రూ. 1500గా నిర్ణయించాలని భావిస్తున్నారట. ఏపీలో విడుదలకు ముందు రోజు రాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో వేసేలా అనుమతులు తీసుకున్నారట.

తెలంగాణలో మాత్రం సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 9న ఉదయం 6 గంటలకు బెనిఫిట్ షో వేయనున్నట్టు సమాచారం. అంతేకాదు, ఈ సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే జీవోలను జారీ చేశాయి. దీంతో టికెట్ ధర రూ. 300 నుంచి రూ. 500 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates