ఎన్టీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశాడు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ముహూర్తం ఖరారు చేస్తూ చిత్రబృందం ప్రకటన చేసింది. ఫిబ్రవరి 10 నుండి సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అదే నెల 15 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు.

ఇది ఎన్టీఆర్ కు 27 వ సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో సినిమా ప్రారంభానికి ముందే హైప్ క్రియేట్ అయింది. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో పాటు స్పెషల్ సాంగ్ లో రాయ్ లక్ష్మి కనిపించనుందని టాక్. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండడం విశేషం.