HomeTelugu Trendingకరోనా ఎఫెక్ట్‌: వకీల్‌ సాబ్‌ వాయిదా!

కరోనా ఎఫెక్ట్‌: వకీల్‌ సాబ్‌ వాయిదా!

2 16
టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. ఈ నెల 31వరకు షూటింగ్‌లకు క్యాన్సిల్ చేస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి.

తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాపై కూడా కరోనా ఎఫెక్ట్ పడేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ఓ షెడ్యూల్ ఈ నెల 21న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు షూటింగ్‌లకు విరామం ఇచ్చిన సమయంలో పవన్ టీమ్ డైలమాలో పడ్డదట. షూటింగ్ కు బ్రేక్ ఇస్తే సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. అసలే పవన్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. అందువల్ల ఈ సినిమా కోసం పవన్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీని దిల్ రాజు, బోని కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu