చిరు విలన్, పవన్ కు హిట్ ఇస్తాడా..?

తెలుగులో అగ్ర హీరోల సరసన నటించిన అంజలా ఘావేరి భర్త తరుణ్ అరోరా రీసెంట్ గా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో విలన్ గా కనిపించాడు. నిజానికి తరుణ్ అరోరాని చిరంజీవికి పరిచయం చేసింది పవన్ కల్యాణ్ అనే మాటలు వినిపించాయి. ఆ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. అలానే పవన్ ప్రస్తుతం నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమాలో కూడా విలన్ గా తరుణ్ అరోరానే ఎన్నుకున్నారు.

అసలే టాలీవుడ్ లో సెంటిమెంట్స్ ఎక్కువ ఆ సెంటిమెంట్ తోనే అన్నయ్యకు హిట్ ఇచ్చిన విలన్ ను తమ్ముడు కూడా తన సినిమాలో పెట్టుకున్నాడు. మరి తరుణ్ అరోరా సెంటిమెంట్ పవన్ కు వర్కవుట్ అవుతుందా..? తను ఆశించినట్లుగానే హిట్ ను అందుకుంటాడేమో చూడాలి!