పవన్ మరదల్ని నేనే అంటోంది!

పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పవన్ మరదలుగా మరో పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం మానస హిమవర్ష అనే నటిని ఎంపిక చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మానస ఈ విషయాన్ని తెలియజేశారు. పవన్ అభిమాని అయిన తను ఆయన మరదలిగా నటించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. పవన్ ను ఇష్టపడే మరదలిగా.. ఆయన చెల్లితో కలిసి ఆయన్ను టీజ్ చేసే పాత్రలో కనిపిస్తానని వెల్లడించారు. ఈ సినిమాలో మొత్తం లంగావోనీలలోనే కనిపిస్తా అన్నారు. ప్రస్తుతం మానస ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
Attachments area
CLICK HERE!! For the aha Latest Updates