పవన్‌ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చంద్రబాబు, జగన్‌ కుటుంబాలకేనా, సామాన్యులకు అవసరం లేదా? అని ప్రశ్నించారు. శాసన సభకు వెళ్లని ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమా..? అని ప్రశ్నించిన పవన్‌… సైకిల్ పాతబడి పోయింది.. తెలంగాణ సీఎం కేసీఆర్ సైకిల్ చైన్ తెంపాడు.. ఇక ఫ్యాన్ తిరగాలంటే పవర్ మనం ఇవ్వాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్‌ను సైతం మనకే ఓటు వేయాలని కోరుతున్నారు అని పవన్ అన్నారు… వైసీపీ అంటే టీడీపీకి భయం అని వైసీపీని ఎదుర్కోవాలంటే జనసేన పార్టీయే కరెక్ట్ అన్నారు. జగన్.. అమిత్‌షా పార్టనర్ అని బీజేపీ పార్టనర్ కేసీఆర్ అని జనసేనాని ఆరోపించారు. ఇక నేను టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే బహిరంగంగా పెట్టుకుంటానని .. జగన్ లాగా దొడ్డిదారిన పోయి ప్రధాని మోడీ కాళ్లు పట్టుకోనని ఎద్దేవా చేశారు.