పవ‌న్ క‌ల్యాణ్ కొత్త చిత్రం ప్రారంభం!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా శ్రీ సాయిరాం క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 4గా కొత్త చిత్రం విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఫిలింన‌గ‌ర్‌లోని నిర్మాణ సంస్థ కార్యాల‌యంలో లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.ర‌త్నం ఈ  చిత్ర స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్లా చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆర్‌.టి.నేస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఐశ్వ‌ర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎ.ఎం.ర‌త్నం, శ‌ర‌త్ మ‌రార్‌, జ్యోతికృష్ణ‌, ఆర్.టి.నేస‌న్‌, ఎ.ఎం.ర‌త్నం సోద‌రుడు ద‌యాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు.
 
CLICK HERE!! For the aha Latest Updates